Sentence
stringlengths 7
4.52k
|
---|
విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్లో మరింత పురోగమిస్తుంది |
మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి |
మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొట్ట తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది |
తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథలాంటి పథకాన్ని తీసుకరావాలని మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి |
సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోంది |
పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలిగాం |
ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వందశాతం అందుతాయి |
తెలంగాణ నేల నుంచి కరువును శాశ్వతంగా పారద్రోలగలగడం సాధ్యమవుతుంది |
ప్రజా సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవన భద్రత కల్పించుకోగలిగాం |
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో దూసుకుపోతున్నాం అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు |
అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడటం ఒక మచ్చగా మిగిలింది |
గత పాలకులు అందరినీ అక్షరాస్యులుగా మార్చడంలో విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది |
ప్రతీ ఒక్కరూ నూతన సంవత్సరంలో వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేయాలి |
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్న భరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారు |
ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం |
అదే విధమైన స్ఫూర్తితో వందశాతం అక్షరాస్యత సాధించడానికి కృషి చేయాలి |
తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది |
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి |
తద్వారా తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు |
గవర్నర్, మంత్రుల శుభాకాంక్షలు 2020 నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు |
తెలంగాణ ప్రజలు కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు |
అలాగే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోళ్ల ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్ తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు |
సోమవారం పినపాక నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా లబ్ధి జరగనున్నదన్నారు |
ఈ ప్రాజెక్టు పూర్తయితే 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు |
మారుమూల ప్రాంత రైతుల భూములకు కూడా సమృద్ధిగా నీరందుతుందన్నారు |
దుమ్ముగూడెం వద్ద బ్యారేజి నిర్మిస్తే ఎప్పుడూ 40టీఎంసీల నీరు నిల్వ ఉండేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు |
ఇప్పటికే పినపాక నియోజకవర్గం సింగిరెడ్డిపాలెంలో 19కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని పేర్కొన్నారు |
ఈ నియోజకవర్గ పరిధిలో మరో 5ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు |
ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు నేరుగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు |
మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రం కేంద్ర బిందువుగా ఈ ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు |
గిరిజన గ్రామాల ప్రజలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు 300కోట్ల రూపాయలతో 3ఫేజ్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు |
అనంతరం సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన జనవరి మాసంలో పంపుహౌజ్ల ట్రయల్న్ నిర్వహిస్తామన్నారు |
ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు |
రైతులకు పుష్కలంగా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు |
మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ లక్ష్మినారాయణ, ఎంపీ కవిత తదితరులు ఉన్నారు |
700 కోట్ల భారం తగ్గిందని రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు |
సోమవారం విద్యుత్ సౌధలో విద్యుత్ శాఖలో ఓసీ ఉద్యోగ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరించారు |
ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ గడచిన ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు విద్యుత్ శాఖకు కలసివచ్చిందన్నారు |
కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుతో పాటు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుల నుంచి జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి 1800 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా 4వేల మిలియన్ యూనిట్ల అధిక జల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు |
దీంతో తెలంగాణ విద్యుత్కు రూ |
700 కోట్ల భారం తగ్గడానికి కారణమైయిందన్నారు |
విద్యుత్శాఖలో అందరూ కలసి పని చేస్తేనే విద్యుత్ సంస్థ ముందడుగు వేస్తుందన్నారు |
సమష్టిగా ఉద్యోగులు అందరూ తమ సమర్థతను నిరూపించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు |
విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మూడు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు |
దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలకు భిన్నంగా తెలంగాణ విద్యుత సంస్థలు సమర్థవంతంగా పని చేయడంతో జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోందన్నారు |
వీటిని కొనసాగించడానికి ప్రతి ఉద్యోగి మరింత పని చేయాల్సిన అవసరం ఉందన్నారు |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇంత జలవిద్యుత్ ఉత్పత్తి జరగలేదని ఆయన గుర్తు చేశారు |
విద్యుత్ వినియోగాదారులను సంతృప్తి చేయడమే ఉద్యోగుల ప్రథమ కర్తవ్యం అన్నారు |
వినియోగదారులకు సకాలంలో విద్యుత్ను సరఫరా చేయడంతో పాటు వారి మన్ననలను పొందాలన్నారు |
విభజన చట్టం మేరకు విద్యుత్శాఖలో ఉద్యోగుల పంపకాల్లో ధర్మాధికారి తీర్పుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు |
అయితే ధర్మాధికారి తీర్పు పట్ల కేంద్ర, రాష్ట్రాలు చర్చిస్తాయని, అంతవరకూ వేచిచూద్దాం అన్నారు |
అప్పటిదాకా ఉద్యోగులు సంయమనం పాటించాలన్నారు |
ధర్మాధికారి తుదితీర్పు రావడంతో ఆంధ్రాకు బదిలీ అయిన ఉద్యోగులు మళ్లీ తెలంగాణకు వస్తారేమో అన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉందన్నారు |
డైరీ ఆవిష్కరణకు ముందు ఓసీ ఉద్యోగుల సంఘం అసోషియేషన్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలకు ప్రభాకరావు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు |
అనతికాలంలోనే విద్యుత్ సంస్థలను మెరుగైన స్థితికి తీసుకువచ్చిన ఘనత దేవులపల్లి ప్రభాకర్రావు దక్కిందన్నారు |
తమ ఆహ్వానాన్ని మన్నించి సీఎండీ ప్రభాకర్రావు డైరీ ఆవిష్కరణకు వచ్చినందకు కృతజ్ఞతలు అంటూ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ భానుప్రకాశ్ అన్నారు |
పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందడంతో పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేక అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు |
సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం నాడు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన సభలో లక్ష్మణ్ మాట్లాడారు |
కొన్ని పార్టీలు సీఏఏకు మతం రంగు పులిమి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు |
ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు |
నాడు జిన్నా మెప్పుకోసం కాంగ్రెస్ పార్టీ తలొగ్గిందని విమర్శించారు |
ఆ రోజు కాంగ్రెస్ అలా చేయకపోతే నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు |
గతంలో పాకిస్తాన్లో 23 శాతం ఉన్న హిందువులు నేడు ఒక్క శాతానికే పరిమితం అయ్యారని గుర్తుచేశారు |
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ నేడు దేశ భక్తులకు, దేశ ద్రోహులకుమధ్య సంఘర్షణ జరుగుతోందని అన్నారు |
తాము మోదీ ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు |
దేశ ద్రోహులను దేశం నుండి వెళ్లగొట్టాల్సిందేనని చెప్పారు |
కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ |
ఈ రైళ్లు జనవరి, మార్చి మధ్య రాకపోకలు సాగిస్తాయి |
రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్ధిక ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని, నేతల ఆర్ధిక అవసరాలకు వేదికగా మారాయని అందుకే రాజధాని భూముల విషయంలో ఈ రగడ కొనసాగుతోందని అన్నారు |
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు అంశం ప్రస్తావనే లేదని నారాయణ అన్నారు |
రాజధాని మార్పు అంశం రైతులు నిరసన దీక్షలపై స్పందిస్తూ రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేపట్టాలని భావిస్తే , సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ఆ భూములను సెజ్ల పేరుతో పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు |
ఎన్నికల మేనిఫెస్టోలో లేని మూడు రాజధానుల అంశం అకస్మాత్తుగా తెరమీదకు తీసుకురావడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు |
రాజధాని మార్చే నైతిక హక్కు జగన్కు లేదని అన్నారు |
మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు |
పై అధికారులే లంచాలకు పాల్పడితే దిగువస్థాయి అధికారులు అవినీతికి పాల్పడితే ఎలా మందలిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు |
సోమవారం హైదరాబాద్ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ శాఖ ఓసీ ఉద్యోగుల అసోషియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు |
ఈ సందర్భంగా రఘుమారెడ్డి మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డీఈ స్థాయి అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిపోవడం అవమానంగా ఉందన్నారు |
ఇలాంటి చర్యలతో తల దించుకునే పరిస్థితి నెలకొందన్నారు |
విద్యుత్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు |
ఉద్యోగులు సేవలు మర్చిపోయి, లంచాలతో వినియోగదారులను వేధించవద్దన్నారు |
విద్యుత్ శాఖలో అవినీతి పెరిగిపోతే ఆర్టీసీకి వచ్చిన నష్టాల గతే తమ సంస్థకు పడుతుందని ఆయన ఉద్వేగంతో అన్నారు |
అధికారులు మేల్కొనకపోతే ఆర్టీసీకి పట్టిన గతే విద్యుత్ సంస్థలకు ప్రమాదం పొంచి ఉందన్నారు |
కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం లంచాలు తీసుకుంటే ఉద్యోగం పోవడంతో పాటు ఉద్యోగి కుటుంబం కూడా అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు |
విద్యుత్ ఉద్యోగులకు రెండుమార్లు వేతన సవరణ చేయడంతో 38 శాతం జీతాలు పెరిగాయన్నారు |
ఒకవైపు పెరిగిన జీతాలు తీసుకంటూ మరోవైపు లంచాలు తీసుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు |
కాంట్రాక్టు, ఆర్టిజన్ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో విద్యుత్ సంస్థలపై అధిక భారం పడుతోందన్నారు |
భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఘటనలను ఆయన ఉపకరించారు |
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం 26వేల కోట్ల ఖర్చు చేయడానకి వివిధ ప్రణాళికలతో పనులను వేగవంతం చేస్తోందన్నారు |
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల్లో విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టడానికి ట్రాన్సికో, జె న్కో సీఎండీ ప్రభాకర్రావు కృషిని ఆయన కొనియాడారు |
విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సంయమనం పాటించడం లేదన్నారు |
వినియోగదారులపై విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని |
రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు |
వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని ఉన్నపళంగా విద్యుత్ సరఫరాను బంద్ చేయవద్దన్నారు |
విద్యుత్ బంద్ చేయడంతో మళ్లీ సరఫరాను పునరుద్ధరించడానికి సమయం పడతుందని దీంతో సమయం వృథా అవుతుందే తప్పా వినియోగదారున్ని సంతృప్తి పర్చలేమన్నారు |
వినియోగదారులపై అధికారులు దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు |
ఆర్థిక పరంగా విద్యుత్ సంస్థలు నిలబడలేకపోతే సంస్థ అథోగతి పాలౌతుందన్నారు |
అవినీతి రహిత సేవను అలవాటు చేసుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు |
వచ్చే ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్ పరీక్షలకు, మార్చి 4వ తేదీ నుండి థియిరీ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు |
65 లక్షల మంది ఫీజులు చెల్లించారని, ఈ సంఖ్య మొత్తం విద్యార్ధులతో పోల్చుకుంటే 97 |
93 శాతం ఉందని ఆయన చెప్పారు |
Subsets and Splits