Sentence
stringlengths
7
4.52k
గోదావరిపై బ్యారేజీల నిర్మాణాన్ని నీటిపారుదల రంగ నిపుణుడు హన్మంత రావు చేసిన సూచనలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు
నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సైతం చర్చలు జరిపిన సంగటి అందరికీ తెలుసన్నారు
ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ చేపట్టిన పనులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు తప్పా నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టివేసి చేతులు దులుపుకునే తతంగం నిర్వహిస్తోందని మండిపడ్డారు
40 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేయగా, ఇది రాబోయే ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల కోట్లకు చేరటం తథ్యమన్నారు
ప్రజల దృష్టి మళ్లించేందుకే విపక్షాలపై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రగతిని మాత్రం అథోగతిపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు
వ్యవసాయ రంగంలో దేశంలో 11వ స్థానంలో ఉండగా, ముఖ్యమంత్రి సాధించిన పురోగతి ఇదేనా? అంటూ ఎద్దేవా చేశారు
గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి మున్సిపల్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త రాగమెత్తుకున్నాడని విమర్శించారు
రైతు రుణమాఫీ, బ్యాంక్ రుణాలు, వడ్డీ రాయితీ, రైతుబంధు క్రమేపీ కనుమరుగవుతుండగా, వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోసిన నీటిని చూస్తే జన్మ ధన్యమైనట్లేనా? అని వ్యంగ్యోక్తి విసిరారు
ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరుగలేదని, ఉద్యోగాల భర్తీ ఉత్తమాటే కాదా? నిరుద్యోగ యువత ఘోషిస్తోందని అన్నారు
ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీలు ఎండమావిగా మారగ, నిరుద్యోగ భృతి అధికార పార్టీకి నినాదంగా మారిందని ఎద్దేవా చేశారు
ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ భావాలు రెచ్చగొడుతూ తిరిగి మున్సిపాలిటీల్లో గెలువాలని ప్రయత్నిస్తోందన్నారు
పురపోరులో తెరాసకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు చెర్ల పద్మ, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మేడిపల్లి సత్యం, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, దిండిగాల మధు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి పాల్గొన్నారు
మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ నల్లగొండ మున్సిపాల్టీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతు ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ గెలుపు, విపక్షాలకు ఓటమి తధ్యమన్నారు
ప్రతిపక్ష పార్టీలను ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు బండకేసి కొడుతారన్నారు
హుజూర్నగర్ ఎన్నికలో ప్రజలు సీఎం కేసీఆర్ పక్షాన నిలిచి ప్రతిపక్షాలను ఎలాగైతే ఓడించారో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరుగనుందన్నారు
హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పగటి కలలతో ప్రగల్భాలు పలకగా చివరకు బొక్క బోర్డ పడ్డాడన్నారు
కాంగ్రెస్ వృద్ధ జంబుకాలకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు
మున్సిపల్ ఎన్నికలకు ముందే పీసీసీ చీప్ ఉత్తమ్కుమార్రెడ్డి కోర్టుకు పోతామంటు ముందే ఓటమిని అంగీకరించి పలాయనం చిత్తగించాడన్నారు
మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ గెలిచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ అంశాన్ని, కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కేడర్ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయం సాధించాలన్నారు
అతి విశ్వాసం పనికిరాదని, ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో పనిచేసి అన్ని వార్డుల్లో ఓటర్లను ఆకర్షించి గెలుపు సాధనకు కృషి చేయాలన్నారు
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో అన్ని మున్సిపాల్టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేందుతున్నాయన్నారు
సీఎం కేసీఆర్ పాలనలో నాగార్జున సాగర్ చివరి భూములకు నీళ్లిచ్చిన చరిత్ర టీఆర్ఎస్కే దక్కిందన్నారు
40ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటుకాగా, దండుమల్కాపూర్ ఇండస్ట్రీయల్పార్కు, యాదాద్రి థర్మల్ ఫ్లాంట్, యదాద్రి ఆలయ అభివృద్ధి వంటి పనులతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందడుగు వేస్తుందన్నారు
మున్సిపల్ ప్రజలు చైతన్యవంతంతో వ్యవహరించి ఎన్నికల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించి మున్సిపల్ వార్డుల అభివృద్ధికి అవకాశమివ్వాలన్నారు
ఎన్నికల్లో ప్రజాదరణ ఉండి గెలిచే అభ్యర్థులకు టికెట్లు దక్కుతాయన్నారు
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవిందర్రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్, వేమిరెడ్డి నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, బోయపల్లి కృష్ణారెడ్డి, సుంకరి మల్లేశం, కటికం సత్తయ్యగౌడ్, అబ్బగోని రమేష్ పాల్గొన్నారు
డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పోలీసు ఉన్నాతాధికారులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు
కొత్త సంవత్సరంలో సరికొత్త ఆధునిక ఆలోచనలు, పరిజ్ఞానంతో పౌరుల రక్షణకు పోలీస్ శాఖ పలు చర్యలను చేపడుతోందని అన్నారు
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, మహిళల భద్రత వంటి అనేక విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు అధికారులు ముందుండాలన్నారు
ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు డాక్టర్ జితేందర్, అశోక్ మేహత, మహేష్ భగవత్, నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు
మంగళవారం కాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విపక్ష నేతలు, ఒక వర్గానికి సంబంధించిన మత పెద్దలు పౌరసత్వ చట్ట సవరణను రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో భయాందోళన కల్పిస్తున్నారన్నారు
ఈ చట్ట సవరణపై తెలంగాణ అంతట అవగాహన కల్పించి, అపోహలను తొలగించేందుకు ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు తెలంగాణ అంతట వర్క్షాప్ను, అవగాహన సదస్సులు చేపడుతామని ఆయన వెల్లడించారు
స్వార్ధపర శక్తులను ఎండగట్టి ప్రజలకు ఈ చట్ట సవరణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు
మైనార్టీ ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక పథకం ప్రకారం విపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు
దేశంలో ఒకప్పుడు 12శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 25శాతానికి పెరిగిపోయారని, త్వరలోనే అది 30శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు
మరో బెల్జియం దేశంలాగా మారిపోయో ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
హిందువులకు ఏదైనా ఇబ్బంది వచ్చినట్లైతే ఒక్క భారతదేశం తప్పా మరే ఇతర దేశంలో స్ధానం లేదని అదే క్రిస్టియన్, ముస్లింలకు అపద వచ్చినట్లైతే వారిని ఆదుకునేందుకు అనేక దేశాలు ఉన్నాయన్నారు
కుహాన లౌకీక వాదులు అని చెప్పుకునే కాంగ్రెస్ వామ పక్షాలకు చొరబాటు ధారులు ఓటు బ్యాంక్గా మారారని అన్నారు
దేశంలో అస్థిరత సృష్టించడానికి ఒక వర్గం కుట్ర పన్నుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు
దేశ విభజన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ నివసిస్తున్న ముస్లింతేర వారు ఇబ్బందులు పడుతూ శరణార్ధులుగా మారి దేశానికి వచ్చారని అలాంటి వారికి ఈ పౌరసత్వం కల్పించాలనేది ఈ చట్ట సవరణ అని అన్నారు
దీనిని గతంలోనే అప్పటి ప్రధాని నెహ్రు, ఇందిరాగాంధీ సహా అందరు అంగీకరించారని తెలిపారు
పౌరసత్వ చట్టసవరణపై ఇటీవల కాజీపేటలో ఆందోళన చేసిన ముస్లిం మత పెద్ద ఖుస్రు పాషాపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు
ఈ చట్టం ద్వారా ఖుస్రు ద్వారా పౌర సత్వం రద్దు అవుతుందా సూటిగా చెప్పాలాని ఆయన డిమాండ్ చేశారు
కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటున్నప్పటికి కొందరు మత పెద్దలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం దర్గా కాజీపేట అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు
సామాన్య ప్రజలెవరు వీరిలో మాయలో పడవద్దని ఆయన కోరారు
సమావేశంలో బీజేపి మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, మోడం సదానందం, ఉడుగు శ్రీనివాస్, హరిశంకర్, అంకేశ్వర కుమారస్వామి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సబ్ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యధిక మార్కులు ఇవ్వాలని, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డిని విధిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
గ్రామాల్లో హరిత హారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు
తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పించాలని, అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసే కార్యక్రమంల ప్రభుత్వం చేపట్టిందని, దీన్ని ఉపయోగించుకుని గ్రామంలో చెత్తా చెదారం లేకుండా చూడాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు
చెత్తా చెదారంతో దోమలు వ్యాధులు, డెంగీ జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించే దిశగా స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని అన్నారు
రెండో విడత పల్లె ప్రగతిని ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు
రెండో విడత ఆరోగ్య పరీక్షలు కూడా ప్రజలకు నిర్వహించాలని, గ్రామాలకు అవసరమున్న పనులు గుర్తించి వాటిని పూర్తి చేయాలని, గ్రామాల్లో నర్సరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని, అలాగే శ్మశాన వాటికల నిర్మాణంపై కూడా దృష్టిపెట్టాలని, ప్రభుత్వం అభివృద్ది పనుల కోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు
ఈ కార్యక్రమంలో ఆర్ డి వో బెన్ శాలోమ్, ప్రత్యేక అధికారి రాజర్షి షా, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా స్వతంత్రంగానే పోటీచేస్తుందని పేర్కొన్నారు
ఎన్నికల పర్యవేక్షణకు రాష్టస్థ్రాయిలో ఒక కమిటీని నియమించనున్నట్టు ఆయన చెప్పరు
ప్రభుత్వ జాప్యం వల్లనే ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్లకు పూనుకోగా దాదాపు 70 పిటిషన్లు దాఖలయ్యాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు
ఏడు నెలల జాప్యం తర్వాత ఎన్నికల కమిషన్ షెడ్యూలును విడుదల చేసిందని చెప్పారు
గ్రామాల్లో సంతోషంగా సంక్రాంతి చేసుకోకుండా షెడ్యూలు అడ్డు వస్తోందని అన్నారు
రాజ్యాంగంలోని 73,74 సవరణలతో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు వ్యవహరిస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు
ఓటర్ల జాబితా తయారీలో, వార్డుల విభజనలో, రిజర్వేషన్లలో, తేదీలను నిర్ణయించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర లేకుండా పోయిందని అన్నారు
ఏ వార్డు ఎవరికి రిజర్వు కావాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తోందని ఇక ఎన్నికల సంఘానికి స్వతంత్రత ఎక్కడిదని నిలదీశారు
ఎన్నికల సంఘాన్ని నిందించి ప్రయోజనం లేదని, ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం చేతులుకట్టేసిందని పేర్కొన్నారు
6వ తేదీన రిజర్వేషన్లను ప్రటిస్తామని అన్నారని, 4వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని అన్నారని, ఆరో తేదీన ప్రకటించే రిజర్వేషన్లు సహేతుకమైనవా లేదా అనే అంశంపై అప్పీలు చేసుకునేందుకు సమయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు
మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుంచి తుదివరకూ ఎన్టీఆర్ ప్రస్థానంలో జరిగిన ఆటుపోట్లపై సమగ్ర సమాచారాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చామన్నారు
ఎన్టీఆర్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్న రాజకీయ, సినీ పరిశ్రమకు చెందిన అనేకమందితో మాట్లాడి, చర్చించి వారి అభిప్రాయాలను సాధ్యమైనంత వరకూ వాస్తవాలను అక్షర రూపంలో పుస్తకాన్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు
తమకు తెలిసిన సమాచారాన్ని కుండబద్దలు కొట్టినట్లు పుస్తకంలో పేర్కొన్నామన్నారు
ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ రాయడానికి దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టిందన్నారు
పుస్తకంలో ముఖ్యంగా ఐదు విభాగాలు రూపొందించామన్నారు
1923 మే 28న ఎన్టీఆర్ జననం నుంచి 1996 జనవరి 18న తుదిశ్వాస విడిచే వరకూ జరిగిన ప్రధాన అంశాలను ప్రచురించామన్నారు
ఈ ఐదు విభాగాల్లో సినిమా, రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలను తీసుకువచ్చామన్నారు
సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం నుంచి సినిమా హీరో, అటునుంచి రాజకీయ ప్రస్థానం, తుది రోజుల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం వివరించామన్నారు
రచయితలు ఇద్దరూ కేంద్ర, రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు
చంద్రహాస్ కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఆదాయపు పన్నుల శాఖలో పనిచేశారు
లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు
ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రుల హయాంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు
రచయితలు ఇద్దరూ అనంతపురం జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం
హుజూర్నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని ఎవ్వరూ భయపడవద్దని, తాను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని వెల్లడించారు
మంగళవారం సాయంత్రం హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల, ముఖ్య నాయకుల, ప్రజాప్రతినిధుల, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు
ప్రస్తుతం నియోజకవర్గంలో స్వార్థం, దోపిడీ, వికృతమైన రాజకీయాలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు
మట్టపల్లిలో 46 ఎకరాలు, చింతలపాలెంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు
కొబోటో కంపెనీకి చెందిన ట్రాక్టర్లను తెచ్చి సర్పంచ్లను కొనుగోలు చేయమని ఒత్తిడి తెస్తున్నారని, లేకుంటే సీఎం పంచాయతీలకు ప్రకటించిన రూ
20 లక్షలు రావంటున్నారని, మినరల్ ఫండ్ నిధులలో 20 శాతం కమీషన్ అడుగుతున్నారని, ఎల్ఈడీ విద్యుత్ లైట్ల కొనుగోలులో 20 శాతం కమీషన్ కావాలని సర్పంచ్లను ఒత్తిడి చేయటం, ట్రాక్టర్కు లక్ష వసూలు చేయటం చిల్లర చేష్టలని ఉత్తమ్ ధ్వజమెత్తారు
గత ఎన్నికల్లో తాను ముందుగానే ప్రజలను హెచ్చరించానని అదే ప్రస్తుతం జరుగుతున్నదని అన్నారు
అవినీతిపరులకు భయపడవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు సమాజానికి, ఈ ప్రాంతానికి మేలు చేయాలని అన్నారు
తనను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు గర్వపడే విధంగా పార్లమెంటులో, బయటా పనిచేస్తానని తెలిపారు
హుజూర్నగర్, నేరడిచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో తాను, తన సతీమణి పద్మావతీ పనిచేస్తామని ప్రకటించారు
అంతకు ముందు కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేశారని అయినా ఈవీఎంల సాంకేతిక సమస్య ఏర్పడిందన్నారు
దానిపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని, మరో 6 నెలల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు
మొదటగా ఆనకట్ట కింది భాగంలో కొద్దిగా గండిపడి నీరు పోతూ ఏకంగా అరగంట వ్యవధిలోనే ప్రాజెక్టు ఆనకట్ట కోతకు గురవుతూ ఒక్కసారిగా తెగిపోయింది
ప్రాజెక్టు మధ్యలోని ఆనకట్ట తెగిపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా కిందికి వెళ్లిపోయింది
ఉదయం ఆరు గంటలకు గండిపడగా మధ్యాహ్న ఒంటిగంట వరకు ప్రాజెక్టులోని నీరంతా వెళ్లిపోయి ప్రస్తుతం వెలవెలబోతోంది
వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట దగ్గర గల సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపడడంతో ఆయకట్టు రైతులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు